విజయ్‌ మాల్యా ఆస్తులు జప్తు | London Court Orders To Seize Vijay Mallya Assets | Sakshi
Sakshi News home page

విజయ్‌ మాల్యా ఆస్తులు జప్తు

Jul 5 2018 8:49 PM | Updated on Jul 5 2018 8:49 PM

London Court Orders To Seize Vijay Mallya Assets - Sakshi

విజయ్‌ మాల్యా (పాత ఫోటో)

లండన్‌ : వేల కోట్ల అప్పులను ఎగ్గొట్టి 13 బ్యాంకుల నెత్తిన పిడుగు వేసిన విజయ్‌ మాల్యాపై భారీ పిడుగు పడింది. లండన్‌కు చేరువలో హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో మాల్యాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లేడి వాక్‌, బ్రాంబుల్‌ లాడ్జ్‌, టెవిన్‌, క్వీన్‌ హూ లేన్‌లతో పాటు వెల్విన్‌లోని మాల్యా ఇళ్లలో సోదాలు నిర్వహించడానికి అధికారులకు అనుమతులు ఇచ్చింది.

భారత్‌ ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు’ ట్యాగ్‌ను విజయ్‌ మాల్యాపై వేయడంతో లండన్‌ కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాల్యా విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.

159 చోట్ల మాల్యాకు ఆస్తులు..
విజయ్‌ మాల్యాకు దాదాపు 159 చోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈడీతో కలసి బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన నివేదికలను గురువారం దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు సమయం కావాల్సిందిగా ధర్మాసనాన్ని కోరారు.

కాగా ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల’ కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు వచ్చేనెల 27 లోగా విజయ్ మాల్యా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.9000 కోట్ల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement