ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మేకపాటి | lok sabha:YSRCP MP Mekapati rajamohan reddy speaks on special status for andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మేకపాటి

Aug 1 2016 5:05 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మేకపాటి - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మేకపాటి

ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యతకను వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభలో వివరించారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆవశ్యతకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం లోక్‌ సభలో వివరించారు.  పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 26 నెలలు గడిచాయని, 5కోట్లమంది ప్రజలు హోదా కోసం ఆందోళనగా  ఉన్నారన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అనేక హామీలు ఇచ్చారని మేకపాటి ఈ సందర్భంగా సభలో గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గౌరవాన్ని అందరూ కాపాడాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు. పార్టీ మారినవారిని మూడు నెలల సమయం ఇచ్చి, వారిపై అనర్హత వేటు వేసే  అధికారం ఎన్నికల కమిషన్కు ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement