పార్లమెంటులో ఉభయ సభలు మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం నడుమ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో నేషనల్ హెరాల్డ్ కేసుపైన చర్చించాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేయటంతో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. రాజ్యసభలో నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా పడింది. అదేవిధంగా లోకసభలోనూ అదేవిషయంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో లోకసభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.