ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు | List of Maharashtra and Haryana assembly winners | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు

Oct 19 2014 3:09 PM | Updated on Oct 8 2018 6:02 PM

ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు - Sakshi

ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది.

హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమవుతోంది.  మహారాష్ట్రలో రెండవ స్థానంలో శివసేన, ఆ తర్వాత స్థానాలు వరుసగా కాంగ్రెస్, ఎన్సీపీ నిలిచేలా ఉన్నాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక్కడ రెండవ స్థానంలో ఐఎన్ఎల్డీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇరు రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

 

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు:

బీజేపీ - 55
శివసేన - 29
కాంగ్రెస్  - 25
ఎన్సీపీ - 21
ఇతరులు - 17

గెలుపొందినవారు:
అజిత్ పవర్ (ఎన్సీపీ)
వైభవ్ నాయక్ (శివసేన)
దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ)
పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్)

ఓడిపోయినవారు:
నారాయణ రాణె (కాంగ్రెస్)

 

హర్యానాలోని మొత్తం 90 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు:
బీజేపీ - 45
కాంగ్రెస్ - 14
ఐఎన్ఎల్డీ - 19
హెచ్జేసీ - 2
ఇతరులు - 6

 

విజయం సాధించినవారు:

భూపీందర్సింగ్ హుడా (కాంగ్రెస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement