భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్‌ గోడలు | Laser walls, smart sensors at India-Bangladesh border soon | Sakshi
Sakshi News home page

భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్‌ గోడలు

Jan 2 2017 9:36 AM | Updated on Sep 5 2017 12:12 AM

భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్‌ గోడలు

భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్‌ గోడలు

భారత్‌–బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దులో చొరబాట్లను నియంత్రించేందుకు లేజర్‌ గోడలను, స్మార్ట్‌ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

కోల్‌కతా: భారత్‌–బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దులో చొరబాట్లను నియంత్రించేందుకు లేజర్‌ గోడలను, స్మార్ట్‌ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) తెలిపింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని నదీతీర ప్రాంతాలు, భౌతికంగా కంచె వేయలేని చోట్ల లేజర్‌ గోడలను ఏర్పాటు చేస్తారు. మరికొన్ని నెలల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టి వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని బీఎస్‌ఎఫ్‌ అనుకుంటోంది.

ఇప్పటికే భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దులో పారామిలిటరీ దళాలు ఫర్హీన్‌ లేజర్‌ గోడలను ఏర్పాటు చేయగా అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు కాగా ఇందులో 2,216.7 కిలోమీటర్ల భూభాగం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. బెంగాల్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 81.7 కిలోమీటర్ల పాటు కంచె నిర్మాణం కోసం భూమిని బీఎస్‌ఎఫ్‌కు కేటాయించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

‘లేజర్‌ గోడలు నిర్మించడానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాక ప్రయోగాత్మకంగా మరికొన్ని నెలల్లోనే ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నాం. లేజర్లు, సెన్సార్లు ఉంచాల్సిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామ’మని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement