
అల్లూరి సీతారామరాజు జిల్లా: చింతూరు మండలం చట్టి జంక్షన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. ఇవాళ (అక్టోబర్ 21, మంగళవారం) తెల్లవారుజామున చట్టి జంక్షన్ సమీపంలో కలవర్టును ఢీకొట్టింది. ఖమ్మం నుంచి బలిమెల (ఒడిశా)కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో యూపీకి చెందిన పాండే అనే జవాను మృతి చెందగా, ఆరుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. వారిని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.