యువ వైద్యురాలు దారుణహత్య | Lady doctor murdered in Mumbai home | Sakshi
Sakshi News home page

యువ వైద్యురాలు దారుణహత్య

Dec 6 2016 7:47 PM | Updated on Sep 4 2017 10:04 PM

ముంబైలో యువ వైద్యురాలు(24) దారుణహత్యకు గురైంది.

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో యువ వైద్యురాలు(24) దారుణహత్యకు గురైంది. నగర శివారులోని విలే పార్లే ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలు ఫిజియోథెరపిస్టుగా పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పార్టీ నుంచి కొంత మంది స్నేహితులతో కలిసి తన ఇంటికి తిరిగివచ్చింది.

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా పడివున్న శవాన్ని గుర్తించారు. అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement