ఆదివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న సంక్షేమ పథకాలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించా లని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
జీఎస్టీపై జైట్లీకి కేటీఆర్ విజ్ఞప్తి
- ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరు
- పథకాలపై పడే ఆర్థిక భారం వివరాలు కోరిన జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న సంక్షేమ పథకాలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించా లని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంతి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన 17వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా కుమారుడి వివాహం ఉండడంతో ఆయనకు బదులుగా కేటీఆర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరాకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని జీఎస్టీలో చేర్చడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 1,800 కోట్ల భారం పడుతుం దన్నారు. ఇది పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
అలాగే వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, పేదల గృహ నిర్మాణ పథకాలను జీఎస్టీలో చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ. 11 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ప్రజాసంక్షేమం కోసం అమలు చేసే పథకాలపై భారం వేయడం వల్ల పథకాల అమలులో జాప్యం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న తాగు, సాగునీటి పథకాలను నీతి ఆయోగ్ ఒక నమూనాగా అభివర్ణించిందని, అలాంటి వాటిపై పన్ను భారం మోపవద్దని జైట్లీని కోరామన్నారు.
తెలంగాణలో 2 వేల వరకు చిన్న, మధ్య తరహా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయని, ఈ పరిశ్రమలపై నిర్ణయించిన 28 శాతం పన్ను శ్లాబ్‌ను 12–18 శాతం పన్ను శ్లాబ్‌లో చేర్చా లని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే చేనేత పరిశ్రమ, బీడీ పరిశ్రమ, గుర్రపు పందేలు, ఇతర చిన్న, మధ్యతరహా పరిశ్రమ రంగాలపై విధించిన పన్నులపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. దీనిపై జైట్లీ సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై, వివిధ పరిశ్రమ రంగాలపై పడనున్న భారంపై పూర్తి వివరాలను సమర్పించాలని కోరార న్నా రు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 4, 5 రోజుల్లో కేంద్రానికి సమర్పిస్తామని కేటీఆర్ మీడియాకు తెలిపారు.
టీటీడీకి పన్ను మినహాయింపుపై అధ్యయనం
ఏపీ మంత్రి యనమల
జీఎస్టీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్ర పరిధిలో ఉన్న చట్టాలను పరిశీలించి పన్ను మినహాయింపుపై అధ్య యనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలి పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనం తరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రసాదం, అగరొత్తు లపై పన్ను లేదన్నా రు. రూ.వెయ్యి లోపు అద్దె గదులపై పన్ను లేదని, ఆపైన వాటికే ఉంటుందని తెలిపారు.