కోల్‌కతా గీతాంజలి రైల్వే స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Kolkata Metro Services Affected After Man Attempts Suicide - Sakshi

కోల్‌కతా: ఓ వ్యక్తి మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో.. మెట్రో సేవలకు అరగంటసేపు అంతరాయం కల్గింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. ఓ మధ్యవయస్కుడు సోమవారం ఉదయం 9.28 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని గీతాంజలి రైల్వే స్టేషన్‌లో ఎదురుగా వస్తోన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతడిని బయటకు లాగారు. ఈ నేపథ్యంలో ఓ అరగంటపాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత యధావిధిగా కొనసాగాయి. ఇంతకు ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరు.. ఏ కారణం చేత ఆత్మహత్యాయత్నం చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top