సెక్స్ రాకెట్ కేసులో 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకుల అరెస్ట్ | 'Kiss of Love' organizer arrested over alleged involvement in online sex racket | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్ కేసులో 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకుల అరెస్ట్

Nov 18 2015 11:42 AM | Updated on Sep 3 2017 12:40 PM

సెక్స్ రాకెట్ కేసులో 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకుల అరెస్ట్

సెక్స్ రాకెట్ కేసులో 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకుల అరెస్ట్

'కిస్ ఆఫ్ లవ్' ఉద్యమ నిర్వాహకుడు రాహుల్ పశుపలన్, ఆయన భార్య రేష్మీ ఆర్ నాయర్ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయ్యారు.

తిరువనంతపురం: 'కిస్ ఆఫ్ లవ్' ఉద్యమ నిర్వాహకుడు రాహుల్ పశుపలన్, ఆయన భార్య రేష్మీ ఆర్ నాయర్ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయ్యారు. బుధవారం కేరళ పోలీసులు రాహుల్ దంపతులతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. కేరళ వ్యాప్తంగా ఆన్లైన్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు కేసు నమోదు చేశారు.

ప్రేమికులపై ఆంక్షలను వ్యతిరేకిస్తూ రాహుల్ 'కిస్ ఆఫ్ లవ్' ఉద్యమాన్ని లేవదీశాడు. దేశంలోని మెట్రో నగరాలకు ఇది విస్తరించింది. కేరళలోని కోజికోడ్లో ప్రేమ జంటలున్న ఓ కాఫీ షాపును కొందరు ధ్వంసం చేయడంతో కిస్ ఆఫ్ లవ్ ఉద్యమం ప్రారంభమైంది. జంటలు బహిరంగంగా ముద్దుపెట్టుకోవడాన్ని కిస్ ఆఫ్ లవ్ ప్రోత్సహించడం వివాదాస్పదంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement