‘కరోనా దేవి’కి కేరళలో నిత్య పూజలు

Kerala Man Conducts Daily Pujas For Corona Devi - Sakshi

తిరువనంతపురం: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కరోనాకు కేరళలో ఓ భక్తుడు నిత్య పూజలు చేస్తున్నాడు. కోవిడ్‌ పోరులో ముందుండే వైద్య, పోలీసు, మీడియా సిబ్బంది, వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల కరుణ చూపాలని వేడుకుంటున్నాడు. వారికి ఎటువంటి హానీ తలపెట్టొద్దని ‘కరోనా దేవి’ని ప్రార్థిస్తున్నాడు. థర్మకోల్‌తో తయారు చేసిన సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ చిత్రాన్ని కడక్కల్‌లో నివాసముండే అనిలన్‌ పూజిస్తున్నాడు. కరోనా దేవి పూజా విశేషాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, అనిలన్‌పై విమర్శలూ వస్తున్నాయి. 

పబ్లిసిటీ కోసమే అతను పూజా డ్రామాలు చేస్తున్నాడని కొందరు విమర్శిస్తుండగా.. మూఢభక్తి ఎక్కువైందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘చదువున్నవారు మంచి ఉద్యోగాలు, ఉన్నత స్థితిలో ఉండటం చూశాం. కానీ, కాలం మారింది. చదివింది ఎంతైనా గుడ్డిగా మతాన్ని విశ్వసించేవారు ఎక్కువవుతున్నారు. మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారు’అని  కేరళలో ప్రముఖ రచయిత, విమర్శకుడు సునీల్‌ పి.ఎలాయిడోమ్‌ కామెంట్‌ చేశారు.
(చదవండి: నాకు మనుషుల్ని చంపడం ఇష్టం: సైకో)

కాగా, తనపై వస్తున్న ట్రోలింగ్‌ను ఎప్పుడూ పట్టించుకోలేదని అనిలన్‌ చెప్తున్నాడు. కరోనా దేవి పూజతో ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నానని పేర్కొన్నాడు. 33 కోట్ల హిందూ దేవతల్లో కరోనా దేవి కూడా ఒకరని అనిలన్‌ తెలిపాడు. నచ్చిన దైవాన్ని​ పూజించడం తన హక్కు అని స్పష్టం చేశాడు. ఇక తన ఇంట్లో కరోనా దేవికి పూజలు చేసేందుకు ఇతరులకు అనుమతి లేదని అనిలన్‌ తెలిపాడు. భారత్‌లో అన్‌లాక్‌-1 పేరుతో దేవాలయాలు తెరవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలు స్వయంగా సృష్టించామని అసహనం వ్యక్తం చేశాడు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాంలోలో కూడా కరోనా దేవికి పలువురు పూజలు చేసిన ఘటనలు తెలిసిందే.ఇదిలాఉండగా.. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
(చదవండి: ముద్దుతో కరోనా నయం చేస్తానని చివరకు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top