ముగ్గురు సినీనటుల పోటీ.. ఎవరిదో విక్టరీ | Kerala elections: War of actors in Pathanapuram constituency | Sakshi
Sakshi News home page

ముగ్గురు సినీనటుల పోటీ.. ఎవరిదో విక్టరీ

May 1 2016 5:15 PM | Updated on Sep 3 2017 11:12 PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పఠానపురం నియోజకవర్గం నుంచి ముగ్గురు సినీనటులు పోటీ పడుతున్నారు.


పఠానపురం(కేరళ): కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పఠానపురం నియోజకవర్గం నుంచి ముగ్గురు సినీనటులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా మలయాళ హీరో కె.బి.గణేశ్ కుమార్ ఉన్నారు. ఆయన మూడు సార్లు యూడీఎఫ్ నుంచి గెలుపొంది ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ తరఫున బరిలోకి దిగుతున్నారు.
 

ప్రముఖ కమెడియన్ జగదీశ్ యూడీఎఫ్ నుంచి, విలన్ పాత్రలు పోషించే రఘు దామోదరన్ అలియాస్ భీమన్ రఘు బీజేపీ నుంచి నామినేషన్ వేయడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఓటరు ఏ నటుడికి పట్టం కడతాడో ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే. మే 16న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement