బాధ్యతలను మరొకరికి అప్పగిస్తున్నా | Sakshi
Sakshi News home page

బాధ్యతలను మరొకరికి అప్పగిస్తున్నా

Published Sun, Sep 16 2018 5:49 AM

Kerala bishop Franco Mulakkal hands over charge - Sakshi

కొట్టాయం/కొచ్చి: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ పరిపాలన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ నెల 13వ తేదీన జారీ చేసిన సర్క్యులర్‌ తాజాగా వెలుగు చూసింది. ‘నేను లేని సమయంలో మాన్‌సిగ్నోర్‌ మాధ్యూ కొక్కండమ్‌ ఈ డయోసిస్‌ పరిపాలన సజావుగా సాగేలా చూసుకుంటారు.  దైవశక్తి జోక్యంతోనే ఈ అంశంలో సత్యం వెలుగు చూస్తుంది.  నాకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన ఆధారాల్లో పరస్పర విరుద్ధాంశాలున్నాయి. ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేరళ పోలీసులు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్‌ వెలువడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement