‘ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాం’

Kashmiri Separatist Leaders Involvement In Terror Funding - Sakshi

జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాద కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు సేకరించారన్న కేసులో నిందితులుగా ఉన్న.. ఆషియా, మసరత్‌ ఆలామ్‌, సబీర్‌ షాలు నేషన్‌ల్‌ ఇన్వేస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విచారణలో కీలక అంశాలను వెల్లడించారు. నిషేధిక ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉద్‌ దవా (జేయూడీ)కు  తాము  నిధులను సమీకరించామని విచారణలో ఒ‍ప్పుకున్నారు. జేయూడీ కార్యకలాపాలకు నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో వారిని ఈనెల 4న ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో నిజాలు బయటకు రావడంతో అధికారులు వారిని అరెస్ట్‌ చేశారు. దీనికి నిరసనగా.. వారి మద్దతు దారులు కశ్మీర్‌ లోయలో నిరసనలు చేపట్టారు.  కాగా కశ్మీర్‌లో భద్రతా బలగాలపైకి రాళ్లు విసురుతూ అ‍ల్లర్లు సృష్టిస్తున్న ఆరోపణలతో ఆషియాపై 2017లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top