
స్కామ్‌ల నుంచి బయటపడేందుకే..
తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తే.. కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేం దుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ప్రకటించిన డీఎంకే అధినేత కరుణానిధిపై తమిళనాడు సీఎం, ఏఐఏ డీఎంకే చీఫ్ జయలలిత నిప్పు లు చెరిగారు.
కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తుపై నిప్పులు చెరిగిన జయలలిత
పొలాచ్చి: తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తే.. కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చేం దుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ప్రకటించిన డీఎంకే అధినేత కరుణానిధిపై తమిళనాడు సీఎం, ఏఐఏ డీఎంకే చీఫ్ జయలలిత నిప్పు లు చెరిగారు. 2జీ సహా ఇతర స్కాంల్లోని కేసుల నుంచి తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకే కరుణానిధి తిరిగి హస్తం బాటపట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పిం చారు. 2జీలో నిందితులుగా ఉన్న కరుణ కుమార్తె కని మొళి, పార్టీ నేత ఏ రాజాలను రక్షించుకునేందుకే ఆయన కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారని మంగళవారం ఇక్కడ నిర్వహించిన ప్రచార సభలో అన్నారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో డీఎంకే ఎన్నడూ తమిళుల సమస్యలను పట్టించుకోలేదన్నారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే..
2జీ కుంభకోణంలో కుమార్తె కనిమొళి జైలు పాలవడంతో దిగ్భ్రాంతికి గురైన కరుణానిధి యూపీఏకి మద్దతు ఉపసంహరించారని, కానీ తమిళుల సమస్యల కోసమే తాను యూపీఏ నుంచి బయటకు వచ్చానంటూ ప్రకటించి తమిళులను మోసం చేసింది నిజంకాదా? కరుణానిధి భార్య, కుమార్తెలు డెరైక్టర్లుగా ఉన్న ఓ టీవీ చానల్‌లో పెట్టుబడులు రూ.214 కోట్లు సరైనవే అయితే, ఎందుకు అంత హడావుడిగా వెనక్కి చెల్లించారు. శ్రీలంకకు వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి తీర్మానంలో భారత్ ఓటు వేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన కరుణ తిరిగి కాంగ్రెస్‌తో పొత్తుకోసం ఎందుకు తహతహ లాడుతున్నారు?