కరుణానిధి అస్తమయం; కర్ణాటక అప్రమత్తం | karunanidhi Passed Away Alert In karnataka | Sakshi
Sakshi News home page

కరుణానిధి అస్తమయం; కర్ణాటక అప్రమత్తం

Aug 7 2018 7:52 PM | Updated on Aug 7 2018 8:39 PM

karunanidhi Passed Away Alert In karnataka - Sakshi

కర్ణాటక, తమిళనాడు సరిహద్దు(పాత చిత్రం)

డీఎంకే అధినేత కరుణానిధి మృతితో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. 

సాక్షి, బెంగళూర్‌ : డీఎంకే అధినేత కరుణానిధి మృతితో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి సరిహద్దు జిల్లాల ఎస్పీలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తమిళనాడుకు వెళ్లే బస్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అధి​కారులు ఎప్పటికప్పడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

దేవేగౌడ సంతాపం
కరుణానిధి మృతిపట్ల మాజీ ప్రధాని దేవేగౌడ సంతాపం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలకు కరుణానిధి ఓ మార్గాన్ని చూపించారని గుర్తుచేశారు. ఆయన్ని అభిమానించే వాళ్లకు ఇది ఒక విషాద క్షణం అని అన్నారు. కరుణానిధి పరిణితి గల నాయకుడు మాత్రమే కాకుండా మంచి రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని పార్థిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement