జయ కేసు విచారణ జనవరి 8కి వాయిదా | Karnataka government's appeal against the High Court verdict acquitting J Jayalalitha in a DA Case adjourned till January 8 | Sakshi
Sakshi News home page

జయ కేసు విచారణ జనవరి 8కి వాయిదా

Nov 23 2015 12:43 PM | Updated on Sep 2 2018 5:24 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌ విచారణ వాయిదా పడింది

న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు కేసు విచారణను  జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో జయలలితను నిర్దోషిగా తీర్పు వెలువరించటాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్ ...ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తీర్పుపై అనుమానాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం ఉన్నత ధర్మాసనంలో పిటిషన్ వేసింది.

కాగా అక్రమాస్తుల కేసులో జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు.  18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.

 

దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..  మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ..సుప్రీంను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement