
ఆస్పత్రిలో కమలహాసన్
ప్రముఖ నటుడు కమలహాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక అన్నాసాలై థౌజండ్‌లైట్స్ సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. కమల్ విషాహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని, బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు తెలిపారు.