ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక

K Srinivas Reddy As A IJU President - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) అధ్యక్షుడిగా ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్న దేవులపల్లి అమర్‌ ఇటీవల ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీ నామా చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఐజే యూ జాతీయ కార్యవర్గ కమిటీ అత్యవసర సమా వేశం అమర్‌ రాజీనామాను ఆమోదించింది. తర్వాత ఎన్నికలో ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా బల్విందర్‌ సింగ్‌ (జమ్మూ) ఎన్నికయ్యారు. బల్విందర్‌ సింగ్‌ పంజాబ్‌ ట్రిబ్యూన్‌ స్పెషల్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top