ఫీజు పెంపుపై కొద్దిగా వెనక్కి

JNU fee hike partially reduced for poor students - Sakshi

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయంపై జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వెనక్కి తగ్గింది. ఎలాంటి స్కాలర్‌షిప్‌ తీసుకోని పేద(బీపీఎల్‌) విద్యార్థులకు హాస్టల్‌ ఫీజు పెంపును తాత్కాలికంగా రద్దుచేసింది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపస్‌ వెలుపల ఈసీ సమావేశమైంది. ఈ నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా పేర్కొన్న విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించాయి. వర్సిటీ సర్వీస్‌ చార్జి రూ.1,700 పెంచడంతోపాటు వన్‌టైమ్‌ మెస్‌ సెక్యూరిటీ ఫీజును రూ.5,500 నుంచి రూ.12,000 వేలకు పెంచింది. బీపీఎల్‌యేతర విద్యార్థులకు ఉపశమనం కలిగించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top