వారు పెళ్లి చేసుకోరు..కానీ

JMM Chief Hemant Sorens Sharp Attack On BJP - Sakshi

రాంచీ : బీజేపీ నేతలపై జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లోని పకూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాషాయ పార్టీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతారని అన్నారు. యూపీలోని ఉన్నావ్‌, హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటనలను ప్రస్తావిస్తూ దేశంలో పలువురు మహిళలను సజీవ దహనం చేస్తున్నారు..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కాషాయ దుస్తులు ధరించి తిరగడం చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

బీజేపీ కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు కానీ కాషాయ దుస్తులు ధరించి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడతారని హేమంత్‌ సొరేన్‌ అన్నారు.మహిళలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని, నేరస్తులకు మాత్రం భద్రత కల్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సైతం జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జేఎంఎం, ఆర్జేడీ కూటమి తరపున హేమంత్‌ సొరేన్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రజల ముందుకు వచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top