క్యాంపస్‌లో ఖాకీలు : విచారణకు డిమాండ్‌

Jamia Varsity Demands Enquiery On Police Action - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపథ్యంలో​ జామియా మిలియా వర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్ధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వర్సిటీ అధికారులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ)కు తాజా నివేదిక సమర్పించారు. క్యాంపస్‌లోకి పోలీసుల ప్రవేశంపై న్యాయ విచారణ చేపట్టాలని వర్సిటీ కోరింది. ఈ ఘటనపై విచారణ కమిటీ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని తాజా నివేదికలో హెచ్‌ఆర్‌డీని కోరింది. డిసెంబర్‌ 15-16 తేదీల్లో మధుర రోడ్‌, జులేనా రోడ్‌లపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారని నివేదికలో వర్సిటీ ఆరోపించింది. ఈ ఘటనలపై న్యాయవిచారణకు ఆదేశించాలని మంత్రిత్వ శాఖకు వర్సిటీ రిజిస్ట్రార్‌ సమర్పించిన నివేదికలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అధికారులు కోరారు. కాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా మిలియా వర్సిటీ విద్యార్ధుల నిరసనలతో వర్సిటీ క్యాంపస్‌ హోరెత్తిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top