జనవరిలో జల్లికట్టు ప్రీమియర్‌ లీగ్‌

Jallikattu Premier League in Chennai from January 7 - Sakshi

సాక్షి, చెన్నై :  ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు రీఎంట్రీతో తెగ సంబరపడుతున్న తమిళవాసులకు మరో సూపర్‌ లీగ్‌ సందడి చేయనుంది. తమిళనాడులోని సంప్రదాయ ‍క్రీడైన జల్లికట్టు ప్రీమియర్‌ లీగ్‌ వచ్చే జనవరి 7 నుంచి ప్రారంభంకానుంది. ఈ లీగ్‌ను తమిళనాడు జల్లికట్టు పెరవై, చెన్నై జల్లికట్టు అమైప్ప సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ పోటీలు సంక్రాంతికి ముందు జనవరి 7 నుంచి ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌లో జరగనున్నాయి. అయితే ఈ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణ గురించి జల్లికట్టుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జంతుహక్కుల సంఘాలు ఇంకా స్పందించలేదు.

పెటా పిటిషన్‌తో మార్చి 7, 2014న సుప్రీంకోర్టు ఈ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమిళనాడు ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. వారికి సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో దిగివచ్చిన కేంద్రం1960 చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top