నార్త్‌బ్లాక్‌లోకి అడుగుపెట్టనున్న జైట్లీ

Jaitly To Resume Work In North Block In August - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మూడు నెలల విరామం అనంతరం ఆగస్టు మాసాంతంలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స నేపథ్యంలో గత మూడు నెలలుగా అధికారిక కార్యక్రమాలకు జైట్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా పీయూష్‌ గోయల్‌ ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నార్త్‌బ్లాక్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో జైట్లీ కార్యాలయంలో ప్రస్తుతం మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. జైట్లీకి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా అత్యంత పరిశుభ్రంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా సోషల్‌ మీడియా వేదికగా జైట్లీ గత కొద్దివారాలుగా విపక్షాల విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. మరోవైపు జైట్లీ అనారోగ్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతులు చూస్తున్న రైల్వే మం‍త్రి పీయూష్‌ గోయల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, సమావేశాలకు హాజరవుతుండటంతో దేశ ఆర్థిక మంత్రి ఎవరని విపక్షాలు సందేహాలు లేవనెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top