‘గర్భవతి శృంగారాన్ని వద్దనడం క్రూరత్వంకాదు’ | Sakshi
Sakshi News home page

‘గర్భవతి శృంగారాన్ని వద్దనడం క్రూరత్వంకాదు’

Published Mon, Nov 7 2016 1:17 AM

‘గర్భవతి శృంగారాన్ని వద్దనడం క్రూరత్వంకాదు’

న్యూఢిల్లీ: గర్భవతి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వం అనిపించుకోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. గర్భవతిగా ఉన్నపుడు భార్య శృంగారానికి ఒప్పుకోవట్లేదంటూ ఆమె నుంచి విడాకులు కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించిన కేసులో కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.

భార్య ఉదయం త్వరగా నిద్రలేవకపోవడం, మంచం మీదకే టీ తెమ్మని కోరడం లాంటివి ఆమె బద్ధకాన్ని సూచిస్తాయేగానీ క్రూరత్వానికి ఉదాహరణలు కాలేవని కోర్టు అభిప్రాయపడింది. భర్త విడాకుల పిటిషన్‌ను ఓ ఫ్యామిలీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా తాజాగా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.

Advertisement
Advertisement