రూ.2000 నోటు వాటర్‌ ప్రూఫా? | Is the new Rs 2000 note waterproof? YouTubers conduct quality test | Sakshi
Sakshi News home page

రూ.2000 నోటు వాటర్‌ ప్రూఫా?

Nov 15 2016 10:14 AM | Updated on Sep 4 2017 8:10 PM

రూ.2000 నోటు వాటర్‌ ప్రూఫా?

రూ.2000 నోటు వాటర్‌ ప్రూఫా?

కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను దక్కించుకునేందుకు సామాన్య జనం నరకయాతన పడుతుంటే కొందరు మాత్రం వాటి నాణ్యతను పరీక్షించే పనిలో పడ్డారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను దక్కించుకునేందుకు సామాన్య జనం నరకయాతన పడుతుంటే కొందరు మాత్రం వాటి నాణ్యతను పరీక్షించే పనిలో పడ్డారు. రూ.2000 నోట్లు దక్కించుకున్న వారు వాటిని మార్చుకునేందుకు నానా కష్టాలు పడుతుండగా, కొందరు వీటిని వివిధ రకాలుగా పరీక్షిస్తున్నారు. ఈ వీడియోలు ఆన్‌ లైన్‌ లో సంచలనంగా మారాయి. కొత్త నోటు నలుగుతుందా, లేదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును రెండు చేతుల్లోకి తీసుకుని నలిపేసి, మళ్లీ సరిచేశారు.

అంతేకాదు వాటర్‌ ప్రూఫా, కాదా అనేది కూడా టెస్ట్‌ చేశారు. రూ. 2000 నోటును నీటిలో ముంచేసి, టాప్‌ వాటర్‌ తో దా​న్ని తడిపి కూడా పరీక్షించారు. పాత నోట్లతో పోలిస్తే ఇది ఎంతవరకు ఎఫెక్టివ్‌ అని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు ఇలా చేశారు. తడిసిన రూ. 2000 నోటు రంగు వెలిసిపోలేదు. అంతేకాదు మామూలు కాగితం, పాత నోట్లతో పోలిస్తే త్వరగా పొడిగా మారింది. పాత నోట్లతో పోలిస్తే రూ. 2000 మెరుగ్గా ఉందని ఈ వీడియోల ద్వారా ప్రయోత్మకంగా నిరూపించారు. యూట్యూబ్‌ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement