జాన్‌ 21నే యోగా డే ఎందుకు? | Interesting Facts of International Yoga Day | Sakshi
Sakshi News home page

జాన్‌ 21నే యోగా డే ఎందుకు?

Jun 21 2019 8:35 AM | Updated on Jun 21 2019 4:07 PM

Interesting Facts of International Yoga Day - Sakshi

జూన్‌ 21నే యోగా డే జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి.

నేడు (జాన్‌ 21) ప్రపంచవ్యాప్తంగా యోగా డేను జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఒకరోజు ముందే సెలబ్రేట్‌ చేసుకుంది. ఏడాది యోగా డేకి ఐక్యరాజ్యసమితి ఇతివృత్తం క్లైమెట్‌ యాక్షన్‌. దీన్ని మనం ఫాలో అవుతూనే, వేరుగా ‘యోగా ఫర్‌ హార్ట్‌’ అనే ఇంకో థీమ్‌తో యోగా డేని జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది.

జూన్‌ 21నే యోగా డే జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. జూన్‌ 21 ఉత్తరార్థ గోళంలో అత్యంత సుదీర్ఘమైన రోజు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే రోజు జూన్‌ 21. ఈ రోజు ప్రకృతిలో ఉండే శక్తులు ఉత్తేజితమవుతాయి. ఇలాంటి సమయంలో యోగను ప్రారంభిస్తే అది సుదీర్ఘ సాధనకు ఉపకరిస్తుందని యోగ గురువులు అంటుంటారు. అందుకే ఈ రోజునే అంతర్జాతీయ యోగా డేగా జరుపుకోవడానికి భారత్‌ ప్రతిపాదించింది. మొదటి అంతర్జాతీయ దినోత్సవం రాజ్‌పథ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీతో సహా 36 వేల మంది యోగాసనాలు వేసి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించారు. 84 దేశాలు ఒక కార్యక్రమంలో పాల్గొనడం మరో రికార్డు. యోగా డేకు సంబంధించిన ఆసక్తికర వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.

Advertisement
 
Advertisement
Advertisement