విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు | Infosys CEO Sikka rakes in 11 million dollars in total compensation | Sakshi
Sakshi News home page

విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు

Feb 25 2016 1:52 PM | Updated on Sep 3 2017 6:25 PM

విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు

విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు

భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా నిలిచారు. సంవత్సరానికి పదకొండు మిలియన్ డాలర్లు అంటే సుమారు 75 కోట్ల రూపాయల జీతాన్నిసిక్కా అందుకుంటున్నారు.

భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా నిలిచారు. ఏడాదికి 11 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 75 కోట్ల జీతాన్నిసిక్కా అందుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. దీంతో మొదట్లో సుమారు రూ. 54 కోట్లు ( 7.8 మిలియన్ డాలర్లు) ఉండే సిక్కా పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది.

సిక్కాకు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు (సుమారు 75 కోట్లు) ప్యాకేజ్ ఉండగా... అందులో ఓ మిలియన్ డాలర్ బేసిక్ శాలరీ, 3 మిలియన్ డాలర్ల వేరియబుల్ పే, 2 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లు, మరో 5 మిలియన్ డాలర్లు స్టాక్ ఆప్షన్స్ కలిపి మొత్తం 11 మిలియన్ డాలర్ల వేతనాన్ని సిక్కా పొందుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజాల్లోని కాగ్నిజెంట్  సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 ప్యాకేజ్ (11.3 మిలియన్ డాలర్లు) కు దగ్గరగా చేరుకుంది. 2013-14 లో టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ప్యాకేజ్ 3.15 మిలియన్ డాలర్లు, అదే సంవత్సరం షేర్లు మినహా మాజీ విప్రో చీఫ్ టి.కె. కురియన్ ప్యాకేజీ 1.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement