breaking news
sikka
-
ఇన్ఫోసిస్ సిక్కా జీతం 67 శాతం డౌన్
న్యూఢిల్లీ: అధిక వేతనాలందుకుంటున్నారంటూ విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా జీతం వాస్తవానికి 2016–17లో 67 శాతం తగ్గిపోయింది. బోనస్ పరిమాణం తగ్గడమే దీనికి కారణం. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక ప్రకారం 2016–17లో సిక్కా జీతంలో నగదు పరిమాణం రూ.16.01 కోట్లుగా ఉంది. 2015–16లో ఇది రూ.48.73 కోట్లు. ఇక బోనస్, గ్రాంట్ ఆఫ్ స్టాక్స్ మొదలైనవన్నీ కూడా కలుపుకుంటే.. జీతభత్యాలు 7 శాతం తగ్గి రూ. 48.41 కోట్ల నుంచి రూ. 45.11 కోట్లకు చేరినట్లు లెక్క. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనంతో (ఎంఆర్ఈ) పోలిస్తే సిక్కా రెమ్యూనరేషన్ 283.07 రెట్లు అధికంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇన్ఫోసిస్ ఎంఆర్ఈ రూ. 5,65,585. -
విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు
భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా నిలిచారు. ఏడాదికి 11 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 75 కోట్ల జీతాన్నిసిక్కా అందుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. దీంతో మొదట్లో సుమారు రూ. 54 కోట్లు ( 7.8 మిలియన్ డాలర్లు) ఉండే సిక్కా పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది. సిక్కాకు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు (సుమారు 75 కోట్లు) ప్యాకేజ్ ఉండగా... అందులో ఓ మిలియన్ డాలర్ బేసిక్ శాలరీ, 3 మిలియన్ డాలర్ల వేరియబుల్ పే, 2 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లు, మరో 5 మిలియన్ డాలర్లు స్టాక్ ఆప్షన్స్ కలిపి మొత్తం 11 మిలియన్ డాలర్ల వేతనాన్ని సిక్కా పొందుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజాల్లోని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 ప్యాకేజ్ (11.3 మిలియన్ డాలర్లు) కు దగ్గరగా చేరుకుంది. 2013-14 లో టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ప్యాకేజ్ 3.15 మిలియన్ డాలర్లు, అదే సంవత్సరం షేర్లు మినహా మాజీ విప్రో చీఫ్ టి.కె. కురియన్ ప్యాకేజీ 1.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది.