సుఖోయ్‌కి బ్రహ్మోస్‌ జత కలిస్తే..

Indian Air Force inducts BrahMos-armed Sukhoi-30MKI fighter squadron - Sakshi

తంజావూర్‌: హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్‌ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్‌) బ్రహ్మోస్‌ క్షిపణులను అమర్చిన సుఖోయ్‌ యుద్ధవిమానాలను ప్రారంభించింది. టైగర్‌షార్క్‌ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్‌30 ఎంకేఐ యుద్ధ విమానాలు దక్షిణ భారత జలాలపై ఆధిపత్యం సాధిస్తాయని ఐఏఎఫ్‌ పేర్కొంది.

ఇక దక్షిణ భారత్‌లో తంజావూర్‌ వ్యూహాత్మక స్థావరంగా మారనుందని పేర్కొంది. భారత్‌–రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్‌ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయని ప్రారంభోత్సవం సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు సులువుగా టార్గెట్‌ చేయగలవు. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top