న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లు సంయుక్తంగా తయారు చేసిన ‘తేలికైన గ్లైడ్ బాంబు’ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో భారతీయ వాయుసేన బాంబును పరీక్షించారు. స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్‌ఏఏడబ్ల్యూ)గా గ్లైడ్ బాంబుకు నామకరణం చేశారు.
70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గ్లైడ్ బాంబు చేరుకోలదని డీఆర్‌డీవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ మూడు సార్లు గ్లైడ్ బాంబును పరీక్షించినట్లు చెప్పింది. త్వరలో గ్లైడ్ బాంబును ఆర్మడ్ ఫోర్సెస్‌కు అందజేస్తామని డీఆర్‌డీవో చైర్మన్ డా. క్రిష్టోఫర్ చెప్పారు.


