ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ | IIT Kharagpur student gets Rs 1.5 crore pay package | Sakshi
Sakshi News home page

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ

Dec 3 2014 2:58 AM | Updated on Aug 27 2019 4:36 PM

ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థికి బంపర్ ఆఫర్ తగిలింది.

కోల్‌కతా: ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థికి బంపర్ ఆఫర్ తగిలింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భాగంగా ఆ విద్యార్థికి రూ.1.5 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకువచ్చింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఓ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ లభించడం ఇదే మొదటిసారి అని ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సదరు విద్యార్థికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని అతని పేరు కానీ, ఆఫర్ ఇచ్చిన సంస్థ పేరు కానీ వెల్లడించడం లేదని తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement