ఇద్దరూ డాక్టర్లు అయితే బాగుంటుందనుకున్నాను..కానీ! | I wanted a doctor match for my daughter, Priya's father Ram Babu Verma | Sakshi
Sakshi News home page

ఇద్దరూ డాక్టర్లు అయితే బాగుంటుందనుకున్నాను..కానీ!

Apr 21 2015 11:36 AM | Updated on Aug 16 2018 4:04 PM

ఇద్దరూ డాక్టర్లు అయితే బాగుంటుందనుకున్నాను..కానీ! - Sakshi

ఇద్దరూ డాక్టర్లు అయితే బాగుంటుందనుకున్నాను..కానీ!

ఎయిమ్స్ డాక్టర్ ప్రియా వేది బలవన్మరణంపై ఆమె తండ్రి రాంబాబు వర్మ(55) కన్నీటి పర్యంతమవుతున్నాడు.

న్యూఢిల్లీ:ఎయిమ్స్ డాక్టర్ ప్రియా వేది బలవన్మరణంపై ఆమె తండ్రి రాంబాబు వర్మ(55) కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఎప్పుడూ అందరితో కలిసి మెలిసి ఉండే తన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ఊహించుకుంటేనే గుండు బరువెక్కుతుందన్నాడు. తన కూతురు సంబంధాన్ని తానే దగ్గరుండి ఎంపిక చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. జైపూర్ లో టైలర్ గా పని చేస్తున్నకూతురు మృతి వార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అనంతరం తూర్పు ఢిల్లీలోని పంకజ్ హోటళ్ కు చేరుకుని కూతురు మృతి చెందిన ప్రాంతంలోని రక్తపు మరకలను పరిశీలించాడు. తన గారాల కూతురు ఇంత తొందరగానే అందర్నీ విడిచి వెళ్లిపోతుందని అనుకోలేదని మీడియా ముందు బరువెక్కిన హృదయంతో అన్నాడు.

 

' మా అమ్మాయి ప్రియ చాలా కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యింది.. నేను కావాలనే డాక్టర్ సంబంధాన్ని చేశా.  డాక్టర్ కమల్ వేదీని కూడా నేనే ఎంపిక చేశా. అంతకుముందు నా కూతురికి మూడు నాలుగు డాక్టర్ సంబంధాలు వచ్చినా వాటిపై ఆసక్తి కనబరలేదన్నాడు. మా ముగ్గురి అమ్మాయిల్లో ప్రియా చాలా తెలివైన అమ్మాయి కాకుండా, స్వతంత్ర భావాలు కలది' అంటూ తండ్రి బోరున విలిపించాడు.

 

ఎయిమ్స్ డాక్టర్ ప్రియ వేది శనివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తూర్పు ఢిల్లీలోని పహర్ గంజ్ లో ఓ హోటల్ లో మణికట్టు కోసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది.  తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొంది.కాగా, తన భర్త గే కావడం వల్లే  బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె ఫేస్ బుక్ పోస్టింగ్స్ తెలియజేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement