husband gay
-
ఇద్దరూ డాక్టర్లు అయితే బాగుంటుందనుకున్నాను..కానీ!
న్యూఢిల్లీ:ఎయిమ్స్ డాక్టర్ ప్రియా వేది బలవన్మరణంపై ఆమె తండ్రి రాంబాబు వర్మ(55) కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఎప్పుడూ అందరితో కలిసి మెలిసి ఉండే తన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ఊహించుకుంటేనే గుండు బరువెక్కుతుందన్నాడు. తన కూతురు సంబంధాన్ని తానే దగ్గరుండి ఎంపిక చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. జైపూర్ లో టైలర్ గా పని చేస్తున్నకూతురు మృతి వార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అనంతరం తూర్పు ఢిల్లీలోని పంకజ్ హోటళ్ కు చేరుకుని కూతురు మృతి చెందిన ప్రాంతంలోని రక్తపు మరకలను పరిశీలించాడు. తన గారాల కూతురు ఇంత తొందరగానే అందర్నీ విడిచి వెళ్లిపోతుందని అనుకోలేదని మీడియా ముందు బరువెక్కిన హృదయంతో అన్నాడు. ' మా అమ్మాయి ప్రియ చాలా కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యింది.. నేను కావాలనే డాక్టర్ సంబంధాన్ని చేశా. డాక్టర్ కమల్ వేదీని కూడా నేనే ఎంపిక చేశా. అంతకుముందు నా కూతురికి మూడు నాలుగు డాక్టర్ సంబంధాలు వచ్చినా వాటిపై ఆసక్తి కనబరలేదన్నాడు. మా ముగ్గురి అమ్మాయిల్లో ప్రియా చాలా తెలివైన అమ్మాయి కాకుండా, స్వతంత్ర భావాలు కలది' అంటూ తండ్రి బోరున విలిపించాడు. ఎయిమ్స్ డాక్టర్ ప్రియ వేది శనివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తూర్పు ఢిల్లీలోని పహర్ గంజ్ లో ఓ హోటల్ లో మణికట్టు కోసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొంది.కాగా, తన భర్త గే కావడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె ఫేస్ బుక్ పోస్టింగ్స్ తెలియజేస్తున్నాయి. -
భర్త 'గే' అని.. వైద్యురాలి ఆత్మహత్య!!
దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఎయిమ్స్ వైద్యురాలు ప్రియా వేది కేసు కొత్త మలుపు తిరిగింది. మణికట్టు కోసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తన భర్త, ఎయిమ్స్‌లోనే వైద్యుడు కమల్ వేది 'గే' అని తేలడం, ఇన్నాళ్లూ నరకాన్ని అనుభవించాల్సి రావడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తనను వరకట్నం కోసం వేధిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది. చర్మవైద్య విభాగంలో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్న కమల్ వేదిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదేళ్లలో తాను పేరుకు మాత్రమే అతడికి భార్యగా ఉన్నానని ప్రియ తన ఫేస్బుక్ పేజీలో శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు రాసింది. తన భర్తకు వేరే మగాళ్లతో సంబంధాలు ఉండేవని చెప్పింది. ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రియ హోటల్లో గది తీసుకుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆమె మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. ఆస్పత్రిలో అర్జంటు కేసు ఉందని చెప్పి ప్రియ శనివారం ఉదయం ఇంట్లోంచి బయల్దేరింది. ఆత్మహత్య చేసుకోడానికి ముందు తన ఫేస్బుక్ పేజీలో భర్త గురించి వివరంగా రాసింది. ఐదేళ్ల క్రితం తనకు డాక్టర్ కమల్ వేదితో పెళ్లయినా, ఇంతవరకు తమమధ్య శారీరక సంబంధం ఏమీ లేదని అందులో చెప్పింది. అతడి ల్యాప్‌టాప్‌లో ఓ జీమెయిల్ అకౌంట్ ఉండేదని, అందులో అతడు తన గే స్నేహితులతో చాట్ చేస్తూ, గే పోర్న్ సినిమాలు చూసేవాడని కూడా రాసింది. ఈ ఐదేళ్లు తనను శారీరకంగా, మానసికంగా చాలా వేధించాడని ఆరోపించింది.


