హిందూ, ముస్లింల మైండ్‌సెట్ మారాలి: కట్జూ | Hindus, Muslims must change their mindset: Markandey Katju | Sakshi
Sakshi News home page

హిందూ, ముస్లింల మైండ్‌సెట్ మారాలి: కట్జూ

Aug 18 2014 12:52 AM | Updated on Oct 16 2018 6:01 PM

హిందూ, ముస్లింల మైండ్‌సెట్ మారాలి: కట్జూ - Sakshi

హిందూ, ముస్లింల మైండ్‌సెట్ మారాలి: కట్జూ

హిందువులు, ముస్లింలు నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే ముందువారి మైండ్‌సెట్ మారాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్

న్యూఢిల్లీ: హిందువులు, ముస్లింలు నిజమైన భారతీయులు అనిపించుకోవాలంటే ముందువారి మైండ్‌సెట్ మారాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఆదివారం వ్యాఖ్యానించారు. ఎస్సీలను చిన్నచూపు చూడటం మానేసినప్పుడే హిందువులు నిజమైన భారతీయులు అనిపించుకుంటారని, ఎస్సీలు, ఎస్సీయేతరుల మధ్య పెద్ద సంఖ్యలో వివాహాలు జరగాలని చెప్పారు.

ముస్లింలలోనూ అగ్రకులాలు-తక్కువ కులాలు అనే తారతమ్యం పోవాలని ఆకాంక్షించారు. మహిళలను తక్కువగా చూసే ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయాలని ముస్లింలంతా డిమాండ్ చేయాలని కట్జూ తన బ్లాగ్‌లో సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement