ములాయం కన్నా అఖిలేశే మిన్న! | he's more popular than Mulayam, shows survey | Sakshi
Sakshi News home page

ములాయం కన్నా అఖిలేశే మిన్న!

Oct 29 2016 2:26 AM | Updated on Aug 17 2018 7:32 PM

ములాయం కన్నా అఖిలేశే మిన్న! - Sakshi

ములాయం కన్నా అఖిలేశే మిన్న!

సమాజ్‌వాదీ పార్టీలో, యాదవ్ కుటుంబంలో నెలకొన్న సంక్షోభం ద్వారా ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ కుమార్ యాదవ్‌కు మేలు జరుగుతోందని..

సీ-వోటర్ సర్వే
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో, యాదవ్ కుటుంబంలో నెలకొన్న సంక్షోభం ద్వారా ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ కుమార్ యాదవ్‌కు మేలు జరుగుతోందని.. తాజా సీ-వోటర్ సర్వేలో వెల్లడైంది. అఖిలేశ్ సీఎం కావాలనుకునే వారి సంఖ్యనెలరోజుల్లోనే గణనీయంగా పెరిగిందని  తెలిపింది. సర్వేలో తండ్రి ములాయం కన్నా అఖిలేశ్‌కే ఎక్కువమంది మద్దతు తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సీ-వోటర్ సంస్థ రెండు వేర్వేరు సర్వేలు నిర్వహించింది. పార్టీలో, కుటుంబంలో అఖిలేశ్‌ను ఒంటరి చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. 403 నియోజకవర్గాల్లో 12,211 మందితో ఈ సర్వే చేయగా.. 75.7 శాతం మంది ములాయం కంటే అఖిలేశే సరైన సీఎం అభ్యర్థని అభిప్రాయపడ్డారు. ఎస్పీలో ఉన్న గుండారాజ్‌ను పక్కనపెట్టేందుకు అఖిలేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement