
సాక్షి, గుర్గావ్ : టోల్ ఫీజ్ చెల్లించమన్నందుకు ఒక మహిళా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘుటన గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద.. గురువారం ఉదయం11 గంటల ప్రాంతంలో జరిగింది. గురువారం ఉదయం గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదున్న ఖేర్కి దులా టోల్ ప్లాజా దగ్గరకు ఒక వాహనం వచ్చింది. ఎప్పటిలానే టోల్ ప్లాజాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిన టోల్ మొత్తాన్ని చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి నేను స్థానికుడను.. నాకు టోల్ ఉండదంటూ ఆగ్రహంగా ఉద్యోగినిపై చేయిచేసుకున్నాడు. అంతేకాక రాయడానికి వీలు లేని విధంగా టోల్ ప్లాజా ఉద్యోగులపై తిట్ల వర్షం కురిపించాడు.
టోల్ ఉద్యోగులంతా అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన సదరు వ్యక్తి అక్కడనుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది కారుకు బారీకేడ్లు అడ్డుపెట్టి పట్టుకున్నారు.
పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. టోల్ ఫీజు అడిగినందుకు నన్ను కొట్టడంతో పాటు.. చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
#WATCH: Man argues & attempts to beat a female toll plaza employee in #Gurugram pic.twitter.com/QlhYun3x3i
— ANI (@ANI) December 7, 2017