అమెరికాలో కాల్పుల కలకలం | Gun firing in central new york | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం

Jun 22 2020 6:23 AM | Updated on Jun 22 2020 6:23 AM

Gun firing in central new york - Sakshi

న్యూయార్క్‌/మినియాపొలిస్‌/అస్టిన్‌: నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యోదంతంతో అట్టుడుకుతున్న అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. మిన్నెసొటా, న్యూయార్క్, టెక్సాస్‌ రాష్ట్రాల్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా 25 మంది గాయపడ్డారు. మిన్నెసొటా రాష్ట్రం మినియాపొలిస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ కార్యక్రమంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా 11 మంది గాయపడ్డారు.  సెంట్రల్‌ న్యూయార్క్‌లో శనివారం రాత్రి ఓ వేడుకలో పాల్గొన్న వారిపై కాల్పులు జరగడంతో 9 మంది గాయపడ్డారు. టెక్సాస్‌ రాజధాని అస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement