కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన | Gujjar stir continues, HC seeks progress report on talks | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన

May 28 2015 3:53 PM | Updated on Sep 3 2017 2:50 AM

గుజ్జర్లు తమ డిమాండ్ నెరవేర్చేదాకా ఆందోళన వీడేది లేదంటూ కదం తొక్కుతున్నారు.

న్యూఢిల్లీ: గుజ్జర్లు తమ డిమాండ్ నెరవేర్చేదాకా ఆందోళన వీడేది లేదంటూ కదం తొక్కుతున్నారు.  గత వారం రోజులుగా పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం రాజస్థాన్ లోని మూడు జిల్లాల్లో తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రైల్వే ట్రాక్లపై ఆందోళన చేపట్టి రైళ్ల రాకపోకలకు  అంతరాయం కలిగించారు. 

ఢిల్లీ - ముంబై దారిని గురువారం స్థంబింపజేశారు. వందల కొద్ది పట్టాలపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ గుజ్జర్లు ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. గుజ్జర్ల ఆందోళన ప్రాంతాలకు 4500 మంది పారా మిలిటరీ బలగాలను పంపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement