రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!

Govt plans to merge Daman and Diu and Dadra and Nagar Haveli Union Territories - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో  బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్‌ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది.  దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top