breaking news
Govt plans
-
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.దుర్వినియోగం కట్టడి..ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.ఆర్థిక వ్యవస్థకూ నష్టం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.👉ఇది చదివారా? ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ల మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. -
ఐదేళ్లలో గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ 2లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వ్యాపార ఆదాయాన్ని ప్రస్తుతమున్న రూ.75,000 కోట్ల నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటాను 10 శాతానికి పెంచుకోవాలని ఈ పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యంలో 17% వాటా కలిగిన చైనా.. పెరిగిన వ్యయాలతో సతమతం అవుతుండడంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విస్తరించాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు సుమారు) స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యాలు మౌలిక రంగం, ఎంఎస్ఎంఈలకు ఉందన్నారు. ‘‘అంతర్జాతీయ ఎగుమతుల్లో చైనా వాటా 17%. మన వాటా 2.6 శాతమే. దీన్ని 8–10 శాతానికి తీసుకెళ్లగల అవకాశం మన ముందున్నది. ముఖ్యంగా చైనా పెరిగిన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మన వాటా పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి’’ అని మంత్రి సూచించారు. దేశంలో అపార వనరులు ఉండి, స్వీయ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా కానీ.. బొగ్గు, పేపర్‌ను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు. -
రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది. -
ఇక కిరోసిన్‌పై కూడా సబ్సిడీ కట్?
ముంబై: ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీలో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కిరోసిన్‌పై సబ్సిడీ కొనసాగించేందుకు సానుకూలంగా లేని ప్రభుత్వం క్రమంగా దీన్ని ఎత్తివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కోత మాదిరిగానే కిరోసిన్ పై సబ్సిడీని కూడా తగ్గించాలని యోచిస్తోంది. ఇంధనాల మార్కెట్ ధరలను సమాజంలోని పేద వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే లక్ష్యంతో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనిచేస్తున్నారని అధికారులు చెప్పినట్టు తెలిపింది. సబ్సిడీ కిరోసిన్ ధరలను ప్రతి పదిహేను రోజులకు 25 పైసలు పెంచాలని చమురు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా సబ్సిడీని తొలగించేంత వరకు, లేదా తదుపరి ఆదేశాల వరకు దీన్ని అమలు చేయాలని కోరింది. సబ్సిడీల్లో కోత పెట్టి వినియోగ వస్తువుల ధరలను మార్కెట్ ధరల స్థాయికి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎల్పీజీ కు మారడానికి వినియోగదారులను ప్రోత్సహించడంతోపాటు, కాలుష్యం నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు దీనిపై భారీ సబ్సిడీ అమలు చేస్తున్న డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2016-17లో 66 శాతం క్షీణించిన కిరోసిన్ వినియోగం 78,447 లీటర్లకు పడిపోయింది. కాగా మార్చి 2018 నాటికి వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే వ్యూహంలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ .4 చొప్పున పెంచాలని జూలై 31 న ప్రభుత్వం ఆదేశించిన చమురు కంపెనీలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, ఢిల్లీ, చండీగఢ్ కిరోసిన్ ఫ్రీ నగరాలుగా ఉన్నాయి. -
గడువు ముగిస్తే.. ఇక చర్యలే..
న్యూఢిల్లీ:నల్లధనం కుబేరులపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అస్త్రశస్త్రాలతో సంసిద్దమవుతోంది. సెప్టెంబర్30 తో ముగియనున్న ఇన్ కం డిక్లరేషన్ స్కీం ముగిసిన తరువాత నల్లధనంపై కఠిన చర్యలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఆదాయ ప్రకటన గడువు పూర్తికాగానే కఠినమైన కార్యాచరణకు దిగనుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నుంచి పన్ను ఎగవేతదారులకు సంబంధించిన డాటాను కూడా సేకరించింది. దీనిలో భాగంగా ఇప్పటికే జరిగిన లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు సీనియర్ సీబీడీటీ అధికారి తెలియజేశారు. వ్యక్తులు, వివిధ సంస్థలకు దాదాపు ఏడులక్షలమందికి పైగా ఈ నోటీసులు అందించింది. జూన్ 1 ప్రకటించిన ఈ ఐడీఎస్ పథకంకింద ఆదాయ ప్రకటనకు ఒక అవకాశం ఇచ్చామని, ఇదే ఆఖరి అవకాశమని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా తమ దగ్గర భారీ సమాచారం ఉందని ఈ మేరకు చర్యలకు దిగనున్నామని సీబీడీటీ స్పష్టం చేసింది. అయితే ఈ గడువు అనంతరం ఏ రకంగా కార్యాచరణ ఉండబోతోందన్న వివరాలను అధికారులు ప్రకటించలేదు. విదేశీ నల్లధనం పథకం కింద రూ. 4,164 కోట్ల విలువ చేసే 648 డిక్లరేషన్లను సిద్ధంగా ఉంచింది. వాటికి ద్వారా సుమారు 2, 476 కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయనుంది. మరో పక్క నల్లధనం నిల్వచేసే, తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకునే బినామీ చట్టం కూడా త్వరలో అమల్లోకి రానుంది. 2018 తర్వాత చాలా దేశాల్లో సమాచార మార్పిడి ఒప్పందాలు అమల్లోకి రానుండటంతో విదేశాల్లో కూడా నల్లధనం అంశంపై నిబంధనలు కఠినతరం కానున్నాయి ఈ లోపు ప్రభుత్వం కూడా నగదు వినియోగాన్ని పూర్తిగా తగ్గించే చర్యలకు దిగనుంది. -
RTI కిందకు వచ్చేందుకు రాజకీయ పార్టీలు ససేమిరా