ఐదేళ్లలో గ్రామీణ పరిశ్రమల టర్నోవర్‌ 2లక్షల కోట్లు

Govt plans to take khadi turnover to Rs 2 trn in next 5 years - Sakshi

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వ్యాపార ఆదాయాన్ని ప్రస్తుతమున్న రూ.75,000 కోట్ల నుంచి వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లకు పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో తన వాటాను 10 శాతానికి పెంచుకోవాలని ఈ పరిశ్రమకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యంలో 17% వాటా కలిగిన చైనా.. పెరిగిన వ్యయాలతో సతమతం అవుతుండడంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విస్తరించాలని సూచించారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు సుమారు) స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యాలు మౌలిక రంగం, ఎంఎస్‌ఎంఈలకు ఉందన్నారు. ‘‘అంతర్జాతీయ ఎగుమతుల్లో చైనా వాటా 17%. మన వాటా 2.6 శాతమే. దీన్ని 8–10 శాతానికి తీసుకెళ్లగల అవకాశం మన ముందున్నది. ముఖ్యంగా చైనా పెరిగిన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మన వాటా పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి’’ అని మంత్రి సూచించారు. దేశంలో అపార వనరులు ఉండి, స్వీయ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నా కానీ.. బొగ్గు, పేపర్‌ను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top