జీవ ఇంధన వాహనాలకు ప్రోత్సాహం: గడ్కారీ | Government to change laws to permit cars to run on different fuels: Nitin Gadkari | Sakshi
Sakshi News home page

జీవ ఇంధన వాహనాలకు ప్రోత్సాహం: గడ్కారీ

Jul 15 2014 1:21 AM | Updated on Sep 2 2017 10:17 AM

దేశంలో జీవఇంధనాల(బయో ఫ్యూయల్)తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి మోటారు వాహనాల చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు.

న్యూఢిల్లీ: దేశంలో జీవఇంధనాల(బయో ఫ్యూయల్)తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి మోటారు వాహనాల చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ప్రమాణాలు ఉండేలా నిబంధనలను రూపొందించనున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సంబంధిత బిల్లును ప్రవేశపెడతామన్నారు.  సోమవారం ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. సాంప్రదాయేతర ఇంధనాలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement