లక్ష కోట్లతో ఫైటర్‌జెట్స్‌ కొనుగోలు

Government issues request for information for fighter aircraft contract - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) శుక్రవారం రిక్వెస్ట్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్‌ ఇండియా కింద భారత్‌లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి.

మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్‌హీడ్‌ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్‌ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్‌–16, ఎఫ్‌–18 కొనుగోలుపై భారత్‌ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top