breaking news
Bomber flight
-
ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్‌లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్‌బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్‌కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్‌లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్‌లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్‌షేక్’ అనే కోడ్ నేమ్‌తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్‌కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్‌కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్‌ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్‌లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్‌కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్‌ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్‌లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి. -
ఏరో షోలో అమెరికా బాంబర్ జెట్ బీ1బీ
బెంగళూరు: బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా గగనతలంలో ప్రత్యేక అతిథి వచ్చి చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్ బాంబర్ జెట్ మంగళవారం బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్ వినువీధులో వీక్షకులకు కనువిందు చేసింది. అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్’ అని పిలుస్తారు. ‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ జూలియన్ చీటర్ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ అన్నారు. కాగా, సోమవారం అమెరికా ఐదోతరం సూపర్సోనిక్ ఎఫ్–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకున్న విషయం విది తమే. ఎఫ్35ఏ భారత్‌లో ల్యాండ్ అవడం ఇదే తొలిసారికావడం విశేషం. బీ–1బీ బాంబర్ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది. -
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో, పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. కాగా, వైమానిక ప్రదర్శనలు వచ్చిన వారు చూస్తుండగా.. వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీ-17 యుద్ధ విమానం రెండో ప్రపంచ యుద్ద కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని కూడా తయారుచేశారు. ఈ చిన్న విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించినట్టు సమాచారం. pic.twitter.com/peyMeEMA25 — Giancarlo (@GianKaizen) November 12, 2022 BREAKING: 2 planes, including a B-17 Flying Fortress, collide at Dallas airshow pic.twitter.com/hdieiJuqvX — BNO News Live (@BNODesk) November 12, 2022 -
తూచ్.. రష్యాకు ఆ డ్రోన్లు మేము ఇవ్వలేదు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్ధంలో భారీగా సైన్యాన్నికోల్పోయిన క్రమంలో ఆత్మాహుతి బాంబర్లు(డ్రోన్లు)తో దాడులు చేయటం మొదలు పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఇరాన్ తయారీ షహీద్(జెరాన్-2) డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రష్యాకు డ్రోన్లు సరఫరా చేస్తోందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఇరాన్. అయితే.. ఆ ఆరోపణలను ఖండించింది ఇరాన్. తాము డ్రోన్లు సరఫరా చేయలేదని కొట్టిపారేసింది. రష్యాకు డ్రోన్లు సరఫరా చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు, ఇటీవల ఓ ప్రార్థనా స్థలంలో ఐఎస్ఐఎస్ దాడులపై ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ‘యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు ఒక్క ఆయుధాన్ని సైతం ఇరాన్ సరఫరా చేయలేదు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి. రక్షణ రంగంలో సహకారంపై రష్యా-ఇరాన్‌ల మధ్య ఒప్పందం మాత్రమే ఉంది. దాని ఆధారంగా డ్రోన్లు సరఫరా చేసినట్లు పశ్చిమ దేశాల మీడియాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది.’ అని స్పష్టం చేశారు ఇరాన్ రాయబారి. మరోవైపు.. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొన్ని వర్గాలు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు డాక్టర్ ఇరాజ్ ఎలాహి. ప్రస్తుతం రెండు ఇరాన్‌లు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ఒకవైపు.. పశ్చిమ మీడియాలు చూపుతున్నది నమ్ముతున్న వారు మరోవైపు అని తెలిపారు. హిజాబ్, ప్రభుత్వానికి మద్దతుగా చాలా ర్యాలీలు జరిగాయని..కానీ మీడియాలు దానిని చూపించలేదని ఆరోపించారు. ఇరాన్‌లోని పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ ఛానల్స్‌ను అనుసరించాలని సూచించారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ బాంబులు.. 8 మంది మృతి -
లక్ష కోట్లతో ఫైటర్‌జెట్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) శుక్రవారం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్ఎఫ్ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్ ఇండియా కింద భారత్‌లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి. మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్–16, ఎఫ్–18 కొనుగోలుపై భారత్ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది. -
రన్‌వే కాదు.. హైవే
బీజింగ్: చైనా వాయుసేనకు చెందిన ఈ యుద్ధవిమానం టేకాఫ్ అవుతున్నది విమానాశ్రయం రన్‌వేపై కాదు. మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఝెంగ్ర-మిన్‌క్వాన్ హైవేపై. ఆదివారం చైనా ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా యుద్ధవిమానాలను ఇలా హైవేపై ప్రయోగాత్మకంగా పరీక్షించింది. చైనాలోని అత్యుత్తమ రహదారుల్లో ఒకటైన ఈ హైవేను పౌర, రవాణా విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు ప్రత్యామ్నాయ విమానాశ్రయంగా కూడా ఉపయోగించవచ్చని సైన్యాధికారులు వెల్లడించారు. యుద్ధం, అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలను సైతం ఈ హైవేపై సురక్షితంగా దింపగలిగేలా చైనా వాయుసేన ఈ పరీక్షల ద్వారా సత్తా చాటిందని తెలిపారు.