ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు

Gold Coins Found In Digging Near Jambukeswarar Temple - Sakshi

తిరుచిరాపల్లి : కేరళలోని పురాతన ఆలయంలో బంగారు నాణేలు లభ్యమయ్యాయి. తిరువనంతపురంలోని జంబూకేశ్వర్‌ ఆలయం వద్ద బుధవారం తవ్వకాలు చేపట్టగా ఏడడుగుల లోపల ఓ నౌకలో 1.7 కిలోల బరువున్న 505 బంగారు నాణేలు లభించాయి. వీటిలో 504 చిన్న నాణేలు కాగా, ఒక పెద్ద నాణెం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. అరబిక్‌ బాషలో ముద్రితమైన అక్షరాలున్న ఈ నాణేలు 100 నుంచి 1200 శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు. నౌకలో దాచిన ఈ నాణేలను తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు. బంగారు నాణేలతో సహా నౌకను పోలీసులకు అప్పగించామని ఎండోమెంట్‌ అధికారులు తెలిపారు.

చదవండి : రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top