అదృష్టమంటే ఇదే.. విహార యాత్ర వెళ్తే 2.87 కోట్ల నిధి సొంతం! | Czech Republic Hikers Find Crores Worth Treasure | Sakshi
Sakshi News home page

అదృష్టమంటే ఇదే.. విహార యాత్ర వెళ్తే 2.87 కోట్ల నిధి సొంతం!

May 3 2025 12:29 PM | Updated on May 3 2025 12:56 PM

Czech Republic Hikers Find Crores Worth Treasure

ఇంట్లో బోర్‌ కొడుతుంది బ్రో.. ఎక్కడికైనా బయటకు వెళ్దామా?.. అంటూ సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు జాక్‌పాట్‌ తగిలింది.  అనుకోకుండా నక్క తోక తొక్కవురా బాబు.. అని సామెత అంటారు కదా.. అలాంటి రేంజ్‌తో వారిద్దరీకి 2.87 కోట్ల నిధి దొరికింది. ఈ ఆసక్తికర ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) దేశంలో చోటుచేసుకుంది. ఈ జాక్‌పాట్‌ నిధికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..  

చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్‌క్ర్కోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఇలా వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత.. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్ధం వచ్చింది. దీంతో, అక్కడ కొంత భూమి పొరను తీసి చూడగానే వారిని నిధి కనిపించింది. దానిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. అనంతరం, వాటిని ఈస్ట్ బోహేమియా మ్యూజియం స్వాధీనం చేసుకుంది. ఈ నిధి ఫిబ్రవరిలోనే దొరికినా.. మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయం వెల్లడించారు.

మ్యూజియం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిధిలో దొరికిన వాటి విలువ సుమారు రూ.2.87 కోట్లు($340,000) ఉంటుందని అంచనా వేశారు. తాజాగా వాటి బరువు సుమారు 15 పౌండ్లు ఉంటుందని పేర్కొంది. అయితే, నిధిలో దొరికిన బంగారు నాణేలు 100 సంవత్సరాల క్రితం 1808 నుంచి 19వ శతాబ్దం ప్రారంభం నాటివని తెలిపారు. ఈ నిధిని 1921 కాలంలో దాచిపెట్టి ఉంటారని అన్నారు. ఇక, ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ ఆస్ట్రియా-హంగేరీ నుంచి వచ్చిన కరెన్సీ కూడా ఈ నిధిలో ఉంది.

ఇదిలా ఉండగా.. నాణేలపై ఉన్న చిన్న గుర్తులు 1918-1992 వరకు ఉన్న పూర్వ యుగోస్లేవియాలో ముద్రించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీలు రష్యన్ దళాలను బహిష్కరించినప్పుడు ముందుకు వస్తున్న రష్యన్ దళాల నుండి వెనక్కి తగ్గడం వల్ల ఈ నిధిని దాచి ఉంటారని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పర్వతం వైపున నిధి ఎలా పాతిపెట్టబడిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ‘చెక్’ దేశ చట్టాన్ని అనుసరించి పర్యాటకులు ఇద్దరికీ మొత్తం విలువలో దాదాపు 10 శాతం పొందే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. విలువైన వస్తువులను భూమిలో నిధుల రూపంలో నిల్వ చేయడాన్ని పూర్వకాలంలో డిపోలు అని పిలిచే ఆచారం స్థానికంగా ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement