‘దేవుళ్ల దేశం దెయ్యాలకు నిలయంగా..’ | God's Own Country is turning into land of demons: Hosabale | Sakshi
Sakshi News home page

‘దేవుళ్ల దేశం దెయ్యాలకు నిలయంగా..’

Jan 24 2017 5:52 PM | Updated on Sep 27 2018 9:08 PM

‘దేవుళ్ల దేశం దెయ్యాలకు నిలయంగా..’ - Sakshi

‘దేవుళ్ల దేశం దెయ్యాలకు నిలయంగా..’

దేవుళ్లకు అలవాలమైన భారత దేశం కాస్త దెయ్యాల నిలయంగా మారుతోందని ఆరెస్సెస్‌ నేత దత్తాత్రేయ హోసబలే అన్నారు.

న్యూఢిల్లీ: దేవుళ్లకు అలవాలమైన భారత దేశం కాస్త దెయ్యాల నిలయంగా మారుతోందని ఆరెస్సెస్‌ నేత దత్తాత్రేయ హోసబలే అన్నారు. కేరళలో జరుగుతోన్న రాజకీయ హింసను గురించి బ్యాక్‌వర్డ్‌ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, ఆరెస్సెస్‌, బీజేపీ కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరుకోవాల్సిందేనని అన్నారు.

ఆరెస్సెస్‌కు జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తోన్న ఆయన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు హిందూ గ్రూపులు కేరళ హౌస్‌ ముందు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని ప్రసంగించారు. ‘దేవుళ్లకు నిలయమైన దేశం కాస్త దెయ్యాల దేశంగా మారుతోంది. కేరళలో ఆరెస్సెస్‌, బీజేపీ కార్యకర్తల దారుణ హత్యలకు సంబంధించిన విషయాలను విస్తృతంగా లోకానికి తెలియజేయండి. ఈహింసను చేస్తుంది సీపీఎం’ అని హోసబలే ఆరోపించారు. ఈ హత్యలపై తాము ఎంతో చెప్పామని, కానీ మీడియా మాత్రం ఆ విషయాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement