‘ఉగ్ర శిబిరాల మూసివేతను నిర్ధారించలేం’

General Rawat Stressed Army Will Continue To Maintain Strict Vigil   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఉగ్రవాద శిబిరాలు మూతపడ్డాయనే వార్తలను తాము నిర్ధారించబోమని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. పాక్‌ చర్యలతో నిమిత్తం లేకుండా తమ సరిహద్దుల వెంబడి భారత సైన్యం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. పీఓకేలో ఉగ్ర శిబిరాలు మూతపడ్డాయని వచ్చిన వార్తలతో పాటు తమ భూభాగంలో ఉగ్ర కార్యకలాపాలను పాకిస్తాన్‌ ఉక్కుపాదంతో అణిచివేయాలని అమెరికా పాక్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు.

కాగా, ఇండో-పాక్‌ సరిహద్దులో నిఘాను పటిష్టం చేసేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సేనలు 2,500కు పైగా బంకర్లు నిర్మించాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ము, కథువా, సాంబా, రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లో పదివేలకు పైగా బంకర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top