పొరపాటున యాసిడ్ తాగి.. | Four year old mistakenly drank acid, back to normal | Sakshi
Sakshi News home page

పొరపాటున యాసిడ్ తాగి..

Oct 11 2016 9:30 AM | Updated on Sep 4 2017 4:59 PM

పొరపాటున యాసిడ్ తాగి..

పొరపాటున యాసిడ్ తాగి..

పొరపాటున యాసిడ్ తాగి ఆరు నెలల తర్వాత ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ బాలుడు. చాలా రోజుల తర్వాత హాయిగా పిజ్జాలు, బర్గర్లు లాగించడం మొదలుపెట్టాడు.

ముంబయి: పొరపాటున యాసిడ్ తాగి ఆరు నెలల తర్వాత ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ బాలుడు. చాలా రోజుల తర్వాత హాయిగా పిజ్జాలు, బర్గర్లు లాగించడం మొదలుపెట్టాడు. ముంబయిలోని మిరా రోడ్డులోని కిండర్ గార్డెన్ స్కూల్లో రాజ్ వీర్ కనోజియా అనే నాలుగేళ్ల బాలుడు చదువుతున్నాడు.

ఈ ఏడాది(2016) ఏప్రిల్ నెలలో కుటుంబమంతా తీర్థయాత్రకు వెళ్లాలని అన్ని సిద్ధం చేసుకుంది. బాలుడి తండ్రి సన్నీ ట్యాక్సీ డ్రైవర్ కావడంతో బ్యాటరీలో పోసే సల్ఫ్యూరిక్ యాసిడ్ బాటిల్ ను ఇంట్లో ఉంచాడు. అది చూడ్డానికి అచ్చం నీళ్లలాగే ఉండటంతో పొరపడిన రాజ్ వీర్ దానిని తాగేశాడు. దీంతో ఆస్పత్రి పాలైన ఆ బాలుడు చివరకు ఆరు నెలల తర్వాత కోలుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement